ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యులుగా గురువారం కదిరికి చెందిన జి.వి సుధాకర్ రెడ్డి పదవీ బాధ్యతలను స్వీకరించారు. పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ ఉదయ్ భాస్కర్, సుధాకర్ రెడ్డి చేత ప్రమాణస్వీకారం చేయించారు.ఈ సందర్బంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ మరింత పారదర్శకంగా పనిచేస్తుందని తెలిపారు.తనకి ఈ పదవీ బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి,విజయసాయిరెడ్డి కి,సజ్జల రామకృష్ణారెడ్డికి, చైర్మన్ ఉదయ్ భాస్కర్ కి,లోకేశ్వర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీఎస్పీ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన జి.వి సుధాకర్ రెడ్డి